»Spanish Church Sells Land In Heaven For 100 Sq Meter Biggest Real Estate Deal On Planet
sale : స్వర్గంలో ప్లాట్లు అమ్ముతున్న స్పానిష్ చర్చి, ఇన్స్టాల్మెంట్ సౌలభ్యమూ ఉందట!
మనం ఇప్పటి వరకు చంద్రుడి మీదో, లేదంటే అంగారకుడి మీదో రియల్ఎస్టేట్ గురించి విని ఉంటాం. ఇప్పుడు ఏకంగా ఓ చర్చి స్వర్గంలోనే ప్లాట్లను సేల్ చేస్తోంది. ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్న ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
Land In Heaven For $100/ Sq. Meter: చంద్రుడి మీద చోటు కొనుక్కోవడం గురించి ఇప్పటి వరకు మనం విన్నాం. మార్స్ మీదా రియల్ ఎస్టేట్ జరుగుతున్న వార్తల్ని చదివాం. ఇప్పటి వరకు కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇలా ఇలాంటి కాంట్రాక్ట్లు చేయడమూ చదివాం. అయితే ఓ స్పానిష్ చర్చి(Spanish Church) ఫాదర్ మాత్రం ఏకంగా స్వర్గంలోనే ప్లాట్లు అమ్మకానికి పెట్టారు. దేవుడి ఇంటికి దగ్గర్లోనే ఆ ప్లాట్లు ఉంటాయని బ్రౌచర్ సైతం విడుదల చేశారు.
స్వర్గంలో రియల్ ఎస్టేట్(Real Estate) చేయడానికి దేవుడు అనుమతి ఇచ్చాడని ఆ ఫాదర్ చెబుతున్నారు. గతంలో 2017లో జరిగిన ఓ మీటింగ్లో ప్రస్తావిస్తే ఆయన అందుకు ఓకే చెప్పినట్లుగా పేర్కొన్నారు. స్వర్గంలో చదరపు మీటరు దాదాపుగా రూ.8వేలుగా రేటు నిర్ణయించారు. ఎవరైనా వెళ్లి స్వర్గంలో దేవుడి ఇంటి దగ్గర్లోనే నివాసం ఉండొచ్చట. పైగా ఫ్లాట్ కొనుక్కునేందుకు ఇన్స్టాల్మెంట్ సౌకర్యాన్ని సైతం వారు కలిగిస్తున్నారు.
ఈ ప్లాట్లు కొనుక్కోవడానికి జీపే, యాపిల్ పే, మాస్టర్ కార్డు, మాస్ట్రో కార్డు, వీసా కార్డు లాంటి అన్నింటితోనూ డబ్బులు చెల్లించవచ్చు. ఈ మేరకు ఆ చర్చి ఓ బ్రౌచర్ని విడుదల చేసింది. తెల్లటి దూది మేఘాల మధ్యలోంచి మెట్లు, అక్కడ ఇళ్లు ఇలా స్వర్గంలోని ఇళ్లను కళ్లకు కట్టింది. ఇంత వరకు ఓకే. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. దీనికి స్పందించి చాలా మంది వేల డాలర్లు సమర్పించి స్వర్గంలో స్థలాలు కొనేస్తున్నారట. ఓ వ్యక్తి ఈ బ్రౌచర్ని ఇంటర్నెట్లో పోస్ట్ చేయడంతో ఈ సంగతి వెలుగులోకి వచ్చింది. అయితే ఇదేం కొత్త కాదట. 2023లోనూ దక్షిణాఫ్రికాలో ఓ పాస్టర్ ఇలా స్వర్గంలో రియల్ ఎస్టేట్(Real Estate) చేశారట.