»If You Buy A House Your Wife Is Free Where Is The Bumper Offer
China: ఇల్లు కొంటే భార్య ఫ్రీ.. బంపరాఫర్ ఎక్కడంటే
ఇల్లు కొనండి..భార్యను ఉచితంగా పొందండి...అంటూ చైనాకు సంబంధించిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రకటన చేసింది. దీనిపై చైనా ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఆ రియల్ ఎస్టేట్ సంస్థకు భారీగా జరిమానా విధించింది.
ప్రతి ఒక్కరికీ సొంతింటి కల అనేది కచ్చితంగా ఉంటుంది. తక్కువ ధరలో ఇల్లు కొనుగోలు చేయాలని చాలా మంది చూస్తూ ఉంటారు. అందుకోసం ఆఫర్లు ఎప్పుడెప్పుడూ వస్తాయా అని ఎదురుచూస్తుంటారు. ప్రజల కోసం పలు రియల్ ఎస్టేట్ సంస్థలు అనేక ఆఫర్లను కూడా ప్రకటిస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి ఆఫర్ నే ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రకటించింది.
చైనాకు చెందిన ఓ కంపెనీ ఇల్లు కొంటే భార్యను ఫ్రీగా ఇస్తామంటూ ఓ ప్రత్యేక ఆఫర్ ను ప్రకటించింది. ఇప్పుడు ఆ ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చైనాలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. ఆ దేశంలో ఇల్లు కొనుగోలు చేసేవారి సంఖ్య భాగా తగ్గిపోయింది. ఈ క్రమంలో ఇండ్లు అమ్ముడు అవ్వాలనే ఉద్దేశంతో ఓ కంపెనీ ఇల్లు కొనండి..భార్యను ఉచితంగా పొందండి అంటూ ప్రకటన చేసింది.
ఇటువంటి ఆఫర్ చూసి చాలా మంది ఇండ్లు కొంటారని ఆ రియల్ ఎస్టేట్ సంస్థ ఎంతో ఆశపడింది. అయితే అది జరగలేదు. ఆ ప్రకటనపై చైనా ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. అటువంటి ప్రకటనలు ఇస్తారా అంటూ ఫైర్ అయ్యింది. అంతేకాదు సదరు రియల్ ఎస్టేట్ సంస్థకు భారీగా జరిమానా విధించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ప్రకటనకు సంబంధించి పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.