PDPL: ఓదెల మండలం కనగర్తిలో భూమి గట్టు వివాదం ఘోరానికి దారితీసింది. పొలం వద్ద గట్టు పంచాయితీ సందర్భంగా ఇద్దరు రైతుల మధ్య జరిగిన గొడవలో ఆది రాజయ్య కిందపడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పొత్కపల్లి ఎస్సై దీకొండ రమేశ్ ఘటన స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. భూమి తగాదాలే ఘటనకు కారణమని స్థానికులు తెలిపారు.