SKLM: జిల్లాలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో పాత భూ హక్కు పత్రాల స్థానంలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జనవరి 2 నుంచి 9 వరకు రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించి అందజేస్తా మని పేర్కొన్నారు. 652 గ్రామాల్లో 2,54,218 పాస్‌పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.