GDWL: గట్టు మండలంలో చలి రోజురోజుకూ పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ప్రజలు వణుకుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి ప్రభావంతో అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు కోరుతున్నారు.