NGKL: వంగూరు మండలం మిట్టసదగోడులో మంగళవారం ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ప్రైవేట్ ఆసుపత్రి సహకారంతో జరిగిన శిబిరంలో సుమారు 40 మంది వైద్యులు పరీక్షలు చేపట్టారు. గ్రామానికి చెందిన 400 మందికిపైగా బీపీ, షుగర్ వంటి పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మంద అరుణ పాండురంగారెడ్డి పాల్గొన్నారు.