W.G: పేదల కళ్లల్లో ఆనందం కోసం ఒకరోజు ముందుగానే పెన్షన్లు అందజేస్తున్నట్లు ఆకివీడులోని కూటమి నాయకులు అన్నారు. ఆకివీడులోని పలు వార్డుల్లో తెల్లవారుజాము నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేశారు. నూతన సంవత్సరానికి రాకముందే తమకు ముందుగా పెన్షన్లు అందించడం పట్ల లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. వార్డు ఇంఛార్జ్ కిమిడి నాగరాజు కూటమి సభ్యులు పాల్గొన్నారు.