వృత్తి నిపుణులకు ఇచ్చే H-1B వీసాల జారీ ప్రక్రియలో కీలక మార్పులకు సంబంధించిన నిబంధనలను అమెరికా ప్రకటించింది. ఈ మేరకు వీసా కేటాయింపుల విధి విధానాలను ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురించింది. ఈ కొత్త పద్ధతి వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. 2027 ఆర్థిక సంవత్సరం H-1B క్యాప్ రిజిస్ట్రేషన్ సీజన్‌కు ఇది వర్తించనుంది.