AP: నంద్యాల జిల్లా మద్దూరు వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆభరణాల మాయం కేసులో కీలక విషయాలు బయటకొచ్చాయి. స్వామివారి వెండి ఆభరణాలను మాజీ ఈవో నర్సయ్య అమ్ముకున్నారు. నర్సయ్యకు పూజారి కిషోర్ శర్మ సహకరించారు. వైకుంఠ ఏకాదశి రోజున విషయం తెలుస్తుందని నిందితులు నకిలీ ఆభరణాలకు వెండి తాపడం చేయించారు. దీంతో పోలీసులు మాజీ ఈవో నర్సయ్య, పూజారి కిషోర్ ను అదుపులోకి తీసుకున్నారు.