బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అయితే ఈ సినిమాపై పశ్చిమాసియాలో నిషేధం విధించారు. దీంతో గల్ఫ్ మార్కెట్లో ఈ సినిమా విడుదల కాకపోవడంతో నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. దాదాపు రూ.90 కోట్ల నష్టం వాటిల్లినట్టు విదేశీ డిస్ట్రిబ్యూటర్ ప్రణబ్ కపాడియా తెలిపాడు.