GDWL: సంఘాల బ్రిడ్జి నుంచి బిజ్వారం వరకు కంకర పోసి వదిలేసారని స్థానికులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. బైక్లు స్కిడ్ అయ్యి ఎప్పుడు ఎవరి ప్రాణాలు పోతాయో తెలియని స్థితిలో ఉన్నాం అని బిజ్వారం ప్రాంత ప్రయాణికులు తెలిపారు. మరోవైపు గతంలో 8 సార్లు తిరిగే ఆర్టీసీ బస్సులను ఇప్పుడు 2 ట్రిప్పులకు తగ్గించడంతో విద్యార్థులు ఆటోలపై వెళ్లాల్సి వస్తుందన్నారు.