GDWL:నూతన సంవత్సర వేడుకల్లో యువత మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని 108 జిల్లా కో-ఆర్డినేటర్ రత్నమయ్య హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా జిల్లాలోని 108 అంబులెన్స్ సిబ్బంది, పైలట్లు అప్రమత్తంగా ఉండాలని బుధవారం ఆదేశించారు. వేడుకల వేళ ప్రజలు మితిమీరిన వేగానికి దూరంగా ఉండాలని ఆయన సూచించారు.