పొలిటికల్ డ్రామాతో నటుడు విశ్వక్ సేన్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నిర్మాణ సంస్థ కళాహీ మీడియా నిర్మించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సదరు నిర్మాణ సంస్థ పోస్ట్ పెట్టింది. రేపు సాయంత్రం 5 గంటలకు తమ ప్రాజెక్టు అనౌన్స్మెంట్ టీజర్ రాబోతున్నట్లు ప్రకటించింది.