AP: రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి అనగాని సత్యప్రసాద్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో రైతులకు రాజముద్రతో పట్టదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తామన్నారు. రాజముద్ర, క్యూఆర్ కోడ్‌తో ఉన్న పాసుపుస్తలు అందజేస్తామని, రీసర్వే పూర్తయిన గ్రామాల్లో 21.80 లక్షల పాసు పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. JAN 2 నుంచి 9 వరకు గ్రామసభల్లో అందజేస్తామన్నారు.