AP: ఎమ్మెల్యే నారాయణ రెడ్డి కంటతడి పెట్టారు. మార్కాపురంని జిల్లాగా ప్రకటించడంతో ఎమోషనల్ అయ్యారు. ‘సీఎం చంద్రబాబుని మా ఇంట్లో దేవుడిగా పూజించుకుంటాం. మేము చేసిన ఉద్యమాన్ని గుర్తించి మార్కాపురంని జిల్లాగా ప్రకటించారు. త్వరలోనే వెలిగొండ ప్రాజెక్టుని కూడా పూర్తి చేస్తాం. ప్రాజెక్ట్ పూర్తి చేసి అక్కడే చంద్రబాబు గుడి కట్టిస్తాను’ అని పేర్కొన్నారు.