టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జనవరి 11 నుంచి న్యూజిలాండ్తో జరగనున్న మూడు వన్డేల సిరీస్లో షమీ ఆడనున్నట్లు తెలుస్తోంది. దేశవాళీ క్రికెట్లో నిలకడగా ఆడుతున్న షమీ పునరాగమనం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. కాగా, ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్షిప్ 2023 ఫైనల్ తర్వాత అతను ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు.