AP: కూటమి ప్రభుత్వం పింఛన్ల పంపిణీతో చరిత్ర సృష్టిస్తోందని ఎమ్మెల్యే సోమిరెడ్డి అన్నారు. ‘రాష్ట్రవ్యాప్తంగా నెలకు రూ.2,700 కోట్లు పింఛన్ల రూపంలో పంపిణీ చేస్తోంది. ప్రభుత్వం పింఛన్ల పథకానికి ఏడాదికి రూ.33వేల కోట్లు ఖర్చు పెడుతోంది. వైసీపీ ప్రభుత్వం కంటే రూ.65 వేల కోట్లు అదనంగా లబ్ధిదారులకు అందిస్తోంది’ అని పేర్కొన్నారు.