MDK: తూప్రాన్ మున్సిపల్ ఓటర్ల జాబితా ముసాయిదాను రేపు పబ్లికేషన్ చేయనున్నట్లు తూప్రాన్ ఆర్డీవో జయ చంద్రారెడ్డి వెల్లడించారు. మున్సిపాలిటీ పరిధిలో వార్డుల వారీగా సిద్ధం చేసిన ఓటర్ జాబితాను కమిషనర్ గణేష్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని 16 వార్డులకు సంబంధించి మొత్తం 32 పోలింగ్ స్టేషన్లలో ఈ జాబితాను ప్రచురిస్తున్నట్లు తెలిపారు.