NRML: కుబీర్ మండలం పార్డి(బి) గ్రామ అభివృద్ధిపై సర్పంచ్ మడి ప్రవీణ్ గ్రామస్థులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ పథకం, చెరువుల సంరక్షణ, గ్రామీణ పారిశ్రామికీకరణ అంశాలపై చర్చించారు. నైపుణ్యాభివృద్ధి ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలని నిర్ణయించారు. అందరూ భాగస్వాములై ఐక్యంగా పనిచేస్తేనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోవచ్చని ఆయన తెలిపారు.