గుంటూరు జిల్లా ఎస్పీ వసూల్ జిందాల్ ఆదేశాల మేరకు, బుధవారం పొన్నూరులోని శ్రీ వెంకటేశ్వర కళాశాలలో ‘సంకల్పం’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు గంజాయి, మత్తు పదార్థాలు, సైబర్ నేరాలపై అర్బన్ సీఐ వీరానాయక్ అవగాహన కల్పించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఐ సూచించారు.