అనంతపురం జిల్లాలో 2025లో రోడ్డు ప్రమాదాలు 9% తగ్గాయని ఎస్పీ జగదీష్ తెలిపారు. గతేడాది 544 ప్రమాదాలు జరగగా ఈ ఏడాది 496కి పరిమితమయ్యాయన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, హెల్మెట్ నిబంధనలతో మరణాల సంఖ్య తగ్గిందని అన్నారు. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా పోలీసులు రూ.67.92 లక్షల సేవ్ చేశారని, గంజాయిపై ఉక్కుపాదం మోపగా 22 మందికి జైలు శిక్ష పడిందని వివరించారు.