NRML: తానూర్ మండలం బొంద్రట్ గ్రామంలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు. సర్పంచ్ రవీందర్ పటేల్ ఆధ్వర్యంలో భోసి వెటర్నరీ డాక్టర్ అమృతం జీవాలకు మందులు వేశారు. జీవాల ఆరోగ్య పరిరక్షణకు టీకాలు కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు నాగేందర్ పటేల్, ఉప సర్పంచ్ శివప్రసాద్, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.