SKLM: సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురంలో ఎమ్మార్వో మధుసూదన్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు ఇవాళ రీ సర్వే గ్రామసభ నిర్వహించారు. స్థానిక ప్రజలు, రైతులు వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. గ్రామ స్థాయి సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించేందుకు ప్రభుత్వం రీ సర్వే గ్రామ సభను నిర్వహిస్తుందని ఎమ్మార్వో అన్నారు. ఇందులో VRO రవికుమార్, నాయకులు ఉన్నారు.