BDK: మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న మౌలిక వసతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా మరో కీలక అడుగు పడింది. కోటి పది లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.