HYD: జీఆర్పీ ఎస్పీ చందనాదీప్తి మరోసారి కీలక అంశాలు వెల్లడించారు. ఈ ఏడాది 1,322 ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు. జీరో ఎఫ్ఐఆర్లను 24 గంటల్లోనే రీ-రిజిస్టర్ చేస్తున్నామని చెప్పారు. క్రిమినల్ గ్యాంగ్ డేటాబేస్ ద్వారా నేరాల నియంత్రణకు మంచి ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. కొత్త రైల్వే స్టేషన్ల ఏర్పాటుపై చర్యలు కొనసాగుతున్నాయన్నారు.