కొంతకాలంగా ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఉక్రెయిన్‌కు చెందిన భూభాగాన్ని మరింత ఆక్రమించుకునేందుకు రష్యా చర్యలు చేపట్టింది. 2026లో ఉక్రెయిన్‌లో బఫర్ జోన్ పెంచమని అధ్యక్షుడు పుతిన్ ఆదేశించినట్లు రష్యా జనరల్ వాలేరి గెరసిమోవ్ తెలిపారు. దీంతో రష్యా దళాలు సుమీ, ఖర్కీవ్ ప్రాంతాల్లోని గ్రామాలను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని చెప్పారు.