TG: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం స్పీడప్ చేసింది. 117 మున్సిపాలిటీలు, ఆరు మున్సిపల్ కార్పొరేషన్లలో ఓటరు జాబితా తయారుచేయడానికి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. జనవరి 10న ఓటరు తుది జాబితాను విడుదల చేయనుంది. అనంతరం వార్డులు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేయనుంది. తర్వాత నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది.