VZM: ఎస్‌కోట నియోజకవర్గంలో సూపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన యూనిట్, బూత్ ఇంఛార్జ్‌లకు మంత్రి నారా లోకేష్ పంపించిన ప్రశంసాపత్రాలను ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అందజేశారు. ఈ సందర్బంగా కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఉంటుందన్న దానికి నిదర్శనమిదేనని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.