TG: పంచాయతీ ఎన్నికల్లో కొన్ని సీట్లు కోల్పోయామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేషన్ ఎన్నికల్లో మంచి ఫలితాలు ఖాయమని స్పష్టం చేశారు. గత 20 ఏళ్లలో లేని అభివృద్ధి ఈ రెండేళ్లలోనే జరిగిందన్నారు. ప్రజాక్షేత్రంలో నిలిచేది తామేనని పేర్కొన్నారు.