మరో 8:30గంటల్లో భారత్ 2026 ఏడాదిలోకి అడుగుపెట్టబోతుంది. కానీ రిపబ్లిక్ ఆఫ్ కిరిటిబాటి ద్వీపం పరిధిలోని క్రిస్ట్మస్ ఐలాండ్ ఇప్పటికే 2026లోకి వెళ్లింది. భారత కాలమానం ప్రకారం అక్కడ 3:30pmకు NEW YEAR ప్రారంభమైంది. 7500 సగటు జనాభా ఉండే ఈ ద్వీప సమూహం ప్రపంచంలోని అత్యంత రిమోట్ ఐలాండ్స్‌లో ఒకటి. కాసేపట్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో న్యూ ఇయర్ మొదలవనుంది.