AP: ద్రాక్షారామ భీమేశ్వరస్వామి ఆలయంలో శివలింగం ధ్వంసం ఘటనలో నిందితుడు శీలం శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పంట కాలువ స్థలం విషయంపై ఆలయ ఉద్యోగులతో గొడవపడిన నిందితుడు.. ఆలయ ఉద్యోగులు, పూజారిపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో పూజారిపై తప్పుడు కేసు మోపే ఉద్దేశంతో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో SP రాహుల్ మీనా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.