KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పత్తి గరిష్ఠ ధర నిలకడగానే ఉంది. బుధవారం యార్డుకు 23 వాహనాల్లో 203 క్వింటాళ్ల విడి పత్తిని రైతులు తీసుకొని రాగా.. గరిష్ఠంగా క్వింటాకు రూ.7,400, కనిష్ఠంగా రూ.6,900లకు ప్రైవేట్ వ్యాపారులు బహిరంగ వేలం ద్వారా కొనుగోలు చేశారు. మార్కెట్ కార్యకలాపాలను ఉన్నత శ్రేణి కార్యదర్శి రాజా పరిశీలించారు.