ATP: కంబదూరు మండలం రాళ్లనంతపురంలో ఉత్తమ కార్యకర్తలకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు బుధవారం ప్రశంసా పత్రాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ నిధులు దుర్వినియోగం చేస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాళ్లనంతపురం గ్రామానికి తారు రోడ్డు, కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.