MBNR: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ కొండా ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని, నాయకులందరూ ఐక్యంగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు.