AP: నెల్లూరులో మంత్రి ఆనం రామానారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయాల్లో తప్పులు జరిగితే ఎంతటి వారైనా వదిలిపెట్టమని హెచ్చరించారు. ద్రాక్షారామం ఆలయ ఘటనలో నిందితుడిని పట్టుకున్నామని చెప్పారు. నంద్యాలలో నకిలీ వెండి ఆభరణాలపై విచారణకు ఆదేశించామని తెలిపారు. ఆభరణాలు స్వామివారికి చేరేవరకు వదిలేదిలేదన్నారు.