విజయ్ హజారే ట్రోఫీలో గోవాతో జరుగుతున్న మ్యాచులో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ విధ్వంసం సృష్టించాడు. 75 బంతుల్లో 9 ఫోర్లు, 14 సిక్సర్లతో 157 రన్స్ చేశాడు. 50 ఓవర్లలో ముంబై 444/8 స్కోర్ చేసింది. ఉత్తరాఖండ్‌తో మ్యాచులో మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 124 రన్స్ చేశాడు. పుదుచ్చేరితో మ్యాచులో కర్ణాటక ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(132), దేవదత్ (113) శతకాల మోత మోగించారు.