WGL: వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి ప్రేమ పేరుతో యువకుడిని మోసం చేసినట్లు తెలిసింది. మ్యాట్రిమోనీ సైట్లో పరిచయమైన యువతి పెళ్లి చేసుకుందామని చెప్పి ఆ యువకుడితో WGLలో చెట్టా పట్టాలేసుకుని తిరిగింది. దీంతో యువకుడు నమ్మి ఆమెకు రూ. 20 లక్షలకు పైగా డబ్బు ఇచ్చాడు. ఆమెకు ఇప్పటికే పెళ్లైనట్లు తెలియడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.