NLG: యూరియా బుకింగ్ యాప్ గురించి రైతులు అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర వ్యవసాయశాఖ అడిషనల్ డైరెక్టర్ నర్సింగరావు అన్నారు. చిట్యాలలోని పీఏసీఎస్, మన గ్రోమోర్ కేంద్రాలను ఆయన బుధవారం సందర్శించి యూరియా యాప్ పనితీరును రైతులకు వివరించారు. ఇంటి నుండే యూరియా బుక్ చేసుకోవచ్చని, ఏ డీలర్ వద్ద ఎంత యూరియా ఉందో తెలుస్తుందన్నారు.