AP: తూ.గో. జిల్లా కొవ్వూరు మున్సిపాలిటీ హోదాను ప్రభుత్వం గ్రేడ్-3 నుంచి గ్రేడ్-1కు పెంచింది. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గడిచిన రెండేళ్లలో మున్సిపాలిటీ ఆదాయ, వ్యయాలను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇవాళ్టి నుంచే గ్రేడ్ పెంపు అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.