అనకాపల్లి నుంచి తుని బైక్ పై వెళుతున్న నక్కపల్లి మండలం ఉపమాకకు చెందిన ప్రమోద్ పాయకరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నాడు. తిరిగి వెళ్లి వెతకగా కనిపించలేదు. వెంటనే పాయకరావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సీఐ అప్పన్న స్పందించి కానిస్టేబుల్ను పంపించారు. కానిస్టేబుల్ ఫోన్ వెతికి బాధితుడికి అప్పగించారు.