WNP: పెబ్బేరులోని ధర్మశాస్త అయ్యప్ప స్వామి దేవాలయంలో చేపట్టిన లలితా త్రిపుర సుందరీదేవి అమ్మవారి ప్రతిష్ఠ, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి విరాళాల సేకరణ కొనసాగుతోంది. బుధవారం పట్టణానికి చెందిన గుండ్రతి యాదగిరి గౌడ్ రూ. 10,001 నగదును ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న ఈ పనులకు సహకరించినందుకు కమిటీ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.