MDK: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పారదర్శక పాలన, అభివృద్ధి సంక్షేమ పథకాలపై విశ్వాసంతో ప్రజలు పెద్ద ఎత్తున బీజేపీలో చేరుతున్నారని ఖేడ్ మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి అన్నారు. బుధవారం శంకరంపేట్లో ఆరేపల్లి మాజీ సర్పంచ్ శంకర్ రావు సహా దాదాపు 50 మంది బీజేపీ పార్టీలో చేరగా వారికి ఆయన పార్టీ కండువా కప్పి స్వాగతించారు.