GDWL: అయిజ ప్రాంత భక్తుల చిరకాల కోరిక నెరవేరుస్తూ శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి నేరుగా నూతన బస్సు సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చాం అని గద్వాల ఆర్టీసీ డీఎం సునీత తెలిపారు. ఈ కొత్త సర్వీసు ప్రతిరోజూ మధ్యాహ్నం 12:15 అయిజ నుండి బయలుదేరి గద్వాల, అచ్చంపేట, మన్ననూర్ మీదుగా రాత్రి 8:30 శ్రీశైలం చేరుకుంటుంది. మరుసటి రోజు మళ్ళీ తిరిగి బయలుదేరుతుంది.