TG: 2025లో తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో పంజా విసిరింది. ఈ ఏడాది మొత్తం 199 కేసులు నమోదు చేసి 273 మంది నిందితులను అరెస్టు చేసినట్లు ఏసీబీ డీజీ చారు సిన్హా వెల్లడించారు. 157 ట్రాప్ కేసుల్లో 224 మంది అరెస్ట్ అయ్యారని.. వీరిలో 176 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని పేర్కొన్నారు. 15 కేసుల్లో రూ.96.13 కోట్లు వెలికి తీశామని తెలిపారు.