NLG: జిల్లా వ్యాప్తంగా నేరాలు, రోడ్డు ప్రమాదాలు, యువతలో పెరుగుతున్న చెడు అలవాట్ల నియంత్రణకు పోలీస్ శాఖ చేపట్టిన ఆపరేషన్ చబుత్ర మంచి ఫలితాలు ఇస్తోందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. గత రెండు రోజుల్లో 300 మందికి పైగా యువకులను అదుపులోకి తీసుకుని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. 337 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశామని తెలిపారు.