NZB: జిల్లా మత్స్య అభివృద్ధి శాఖ అధికారుల సహకారంతో జానకంపేట్ అశోక్ సాగర్ చెరువులో భారీగా చేప పిల్లలను విడుదల చేశారు. గ్రామ మత్స్యకార సంఘం కమిటీ సభ్యుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. 100 శాతం సబ్సిడీపై ప్రభుత్వం 1,14,600 చేప పిల్లలను అందజేసిందని తెలిపారు. చెరువుల్లో నీరు సమృద్ధిగా ఉండటంతో ఈ ఏడాది మత్స్య సంపద గణనీయంగా పెరుగుతుందన్నారు.