కడప జిల్లా టీడీపీ నూతన కమిటీలో కడప నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులకు కీలక పదవులు దక్కడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. కడప పార్లమెంటు ఉపాధ్యక్షునిగా నియమితులైన డా.నిజాముద్దీన్ ఆధ్వర్యంలో బుధవారం కేక్ కటింగ్ చేశారు. నూతనంగా నియమితులైన కార్యవర్గ సభ్యులకు కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీకోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలన్నారు.