BDK: న్యూ ఇయర్ వేడుకల పేరుతో డీజేలు, అధిక శబ్దాలు వచ్చే బాక్సులు వినియోగిస్తే ఉపేక్షించేది లేదని కొత్తగూడెం టూ టౌన్ సీఐ ప్రతాప్ సూచించారు. అలాగే మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వాహనాలు ఇచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, ఆంక్షలు ఉల్లంఘించడం చేయకూడదన్నారు. ఎవరైనా ఇబ్బంది పెడితే 100కు డయల్ చేయాలన్నారు.