WNP: శ్రీరంగాపురం మండలం తాటిపాముల గ్రామ సర్పంచ్ శిరీష మద్దిలేటి, వార్డు సభ్యులు బీఆర్ఎస్ పార్టీని వీడి స్థానిక ఎమ్మెల్యే మెగారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించి వారికి ప్రత్యేక స్థానం కల్పిస్తామని తెలిపారు. ఇందులో సర్పంచ్ శిరీష, వార్డు సభ్యులు రేణుక సురేష్, ఆంజనేయులు పాల్గొన్నారు.