ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్‌ను బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామస్థులు, బీజేపీ నాయకులు బుధవారం ఎంపీ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామ సర్పంచ్ ఆకుల అనిత, ఉప సర్పంచ్ కుమ్మరి మల్లయ్యను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేందర్, జనార్ధన్, జయకుమార్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.